Thank you all for your participation and support with TATVA’s Masks Donation🙏
Media coverage on Masks Donation
కరోనా ఫ్రంట్ లైన్ హీరోస్ కి తత్వా సాయం
వైద్యో నారాయణో హరిః, ఈ కరోనా సమయంలో, ఆ దేవుడే ఈ వైద్యుడి రూపంలో సేవ చేసినట్టు ఉంది. సామజిక సేవ లో ఎప్పుడు ముందుండే, తత్వా, ఆ ఫ్రంట్ లైన్ హీరోస్ కి, సాయం చేయడానికి, మరొక్కసారి ముందుకు వొచ్చింది.
కాలిఫోర్నియా, తౌసండ్ ఓక్స్ లోని, లాస్ రోబ్లెస్ మెడికల్ సెంటర్ ఎమర్జెన్సి విభాగం వారి వినతి మేరకు, 500 మాస్క్స్ లను, 45 హెడ్ కవరింగ్స్ తయారు చేసి వారికి కి అంద చేయడం జరిగింది
ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ తో, ఇంటి నుండి పని చేస్తూ, పిల్లల ఆన్ లైన్ క్లాస్ లతో బిజిగా ఉంటూ, నిత్యావసర వస్తువుల సరఫరా విషయం లో ఇబ్బందులు ఉన్నా… కమ్యూనిటికి సహాయం చేయాలన్నా తత్వా పిలుపుతో, స్థానిక తెలుగు వారు ముందుకు రావడం అభినందనీయం
ఈ రోజు అంద చేసిన 500 మాస్క్ లలో 80 శాతం కి పైగా, అంటే, 400 కి పైగా మాస్క్ లను, వారం రోజుల వ్యవధిలొ మన తెలుగు వారు స్వయంగా ఇండ్లల్లో తయారు చేయడం జరిగింది. అలాగే దాతలు ఇచ్చిన $2000 విరాళలతో మరిన్ని మాస్క్ లు కొనడం జరిగింది
ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్తితులలో, ఫాబ్రిక్ దొరకడం లో ఇబ్బందులు ఎదురైతే, ఇండ్లల్లో ఉన్న కొత్త బెడ్ షీట్స్, ఇండియా నుండి ఎంతో ఇస్టంగా తెచ్చుకున్న కొత్త కాటన్ చీరలను సైతం వాడి ఆసుపత్రి వర్గాల వారి స్పెసిఫికేషన్స్ ప్రకారం మాస్క్స్ లను, హెడ్ కవరింగ్స్ లను తయారు చేయడం జరిగింది
ఎన్నో రంగులు, మరెన్నో డిజైన్స్ కాని అందరి లక్ష్యం ఒక్కటే, “సమాజ సేవ చేయాలని”… వారందరిని తత్వా ఒక వేదిక పైకి తీసుకొచ్చి, దిశా నిర్దేషణ చేసింది
ఆసుపత్రి వర్గాలు తత్వాకి, మాస్క్ లు చేసీన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తత్వా వారు చేసిన మాస్క్ లని, వారి వద్దనున్న N95 మాస్క్ ల మీద అదనపు రక్షణ కోసం వాడుతామని, తద్వారా N95 మాస్క్ ని ఇంకా ఎక్కువ సార్లు వాడవొచ్చని, ప్రస్తుతం N95 మాస్క్ లకి ఉన్న కొరత వల్ల, ఈ మాస్క్స్ లు వారికి ఎంతో ఉపకరిస్తాయని, లాస్ రోబ్లెస్ మెడికల్ సెంటర్ ఆసుపత్రి ఎమర్జెన్సి విభాగం నుండి డా.కార్లో రీయీస్, ధన్యవాదాలని వ్యక్తం చేసారు
కమ్యూనిటికి లో ఏదైనా ఇబ్బంది వొచ్చినప్పుడు... సహాయం చేయడం లో, తత్వా ఎప్పుడు ముందు ఉంటుంది. వారి ప్రాణాలికి తెగించి, కష్ట కాలంలో కమ్యూనిటికి కోసం పని చేసిన, వెంచురా ఫైర్ ఫైటర్స్, ఫస్ట్ రెస్పాండర్స్, సిమివ్యాలి పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి ఆర్ధికంగా సాయం చేసి, వారి సేవల్ని తత్వా వేదిక పైన గతం లో ఘనంగా సత్కరించారు
ఈ ప్రయత్నాన్ని, ఇక్కడితో ఆపకుండా, ఇంకా అవసరం ఉన్న ఆసుపత్రి వర్గాలకి, ఫైర్ డిపార్ట్ మెంట్, పోలీస్, గ్రాసరీ స్టోర్స్ వారికి, గ్రుహావసరాలకి పెద్దవాల్లకి అంద చేయడం జరుగుతుందని, తత్వా కార్యవర్గం తెలిపింది
ఇందులో ఆసుపత్రి వర్గాల వారితో సమన్యయం చేసిన శ్రీమతి. శిరిషా పొట్లూరి గారికి, సహకరించిన అనుపమ సీమకుర్తి, భారితి రాజమణి, బిందు పోలవరపు, దుర్గ వలివేటి, హైమ బుద్ధిరాజు, కాంచన్, లక్ష్మి గోతెటి, లక్ష్మి నిస్టాల, లక్ష్మి పడాల, నీలిమ యాదల్ల, శ్రియ పొన్నగంటి, సుహారిత అల్లు, సునిత బొప్పుడి, సునిత మరసకట్ల, తులసి అడప, విజయ కొప్పు గార్లకు మరియు ఆర్దిక సాయం చేసిన దాతలకి, తత్వా కార్యవర్గం హ్రుదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది